28-09-2025 01:39:13 AM
‘కాంచన’ యూనివర్స్ నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల సిరీస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటోందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాఘవ లారెన్స్ లీడ్‌రోల్స్‌లో నటిస్తూ స్వీయదర్శకత్వం వహించిన ఈ ప్రాంఛైజీ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించింది. అయితే, త్వరలో ‘కాంచన4’ కూడా ప్రేక్షకులను అలరించనుందట. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయ్యిందని కోలీవుడ్ వర్గాల టాక్. ఇందులో బాలీవుడ్ భామ నోరా ఫతేహీ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇందులో పూజా హెగ్డే కూడా భాగమవుతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.
అయితే, తాజాగా పూజా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని సమాచారం. ఆమె స్థానాన్ని రష్మిక మందన్నాతో భర్తీ చేశారట మేకర్స్. రష్మిక ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ‘గర్ల్‌ఫ్రెండ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘థామ్మా’ అక్టోబర్ 21న థియేటర్లలోకి రానుంది. మడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్‌లో రూపొందుతున్న ఈ రొమాంటిక్ హారర్ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట దూసుకుపోతోంది.