28-09-2025 01:37:11 AM
విభిన్నమైన పాత్రలతో అలరి స్తున్నారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పుడామె తన కెరీర్‌లో మరో అడుగు ముందుకువేశారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, దర్శకురాలిగానూ ప్రయాణం మొద లుపెట్టనున్నారు. తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి దోస డైరీస్ బ్యానర్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ బ్యానర్‌పై తొలి చిత్రంగా ‘సరస్వతి’ టైటిల్‌తో ఆసక్తికరమైన థ్రిల్లర్‌ను శనివారం ప్రకటించారు.
అంగ్లంలో రాసి ఉన్న ‘సరస్వతి’ టైటిల్‌లో ‘ఐ’ అనే అక్షరం ఎరుపు రంగులో హైలైట్ చేయబడి, సినిమా ఇంటెన్సిటీని ప్రజెంట్ చేస్తోంది. టైటిల్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించగా, ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్; కెమెరా: ఏఎం ఎడ్విన్ సకే; ఎడిటర్: వెంకట్ రాజేన్; ఆర్ట్: సుధీర్ మాచర్ల.