calender_icon.png 28 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కీ చాన్స్

28-09-2025 01:38:08 AM

‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్‌హిట్ సినిమాలతో పాపులారిటీ సంపాదించుకుంది మీనాక్షి చౌదరి. దీంతో వరుస అవకాశాలతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సంక్రాంతికి నవీన్ పొలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో పలుకరించనుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఆయన 24వ సినిమాలోనూ ఈ భామే హీరోయిన్. అయితే, మీనాక్షికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం సరసన ‘ఫోర్స్3’ చిత్రంలో మీనాక్షి చౌదరి జత కట్టబోతోందట. భావ్ ధూలియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మీనాక్షి లుక్ టెస్ట్ పూర్తి కావటం, ఆమెను హీరోయిన్‌గా ఫైనల్ చేయడం చకచకా జరిగిపోయానని టాక్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా కోసం మీనాక్షి ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందనుందట. షూటింగ్ నవంబర్‌లో ప్రారంభించుకొని వచ్చే ఏడాది థియేటర్లలో వచ్చేలా సన్నాహాలు చేసుకుంటున్నారట ఈ మూవీ టీమ్. మీనాక్షి ఎంపికపై అధికారిక ప్రకటన వెలుడాల్సి ఉంది. ఇదే నిజమైతే మీనాక్షి కెరీర్‌కు మంచి మలుపు అవుతుందంటున్నా సినీ విశ్లేషకులు.