25-10-2025 07:04:50 PM
సీపీఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల
నకిరేకల్,(విజయక్రాంతి): ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల అన్నారు. సిపిఎం పార్టీ, రైతు సంఘం ఆధ్వర్యంలో చీమలగడ్డ, నెల్లిబండ ఐకెపి సెంటర్స్ లో సందర్శించి ధాన్యం కొనుగోలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడుతూ... ఐకెపి సెంటర్లో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అకాల వర్షాల కారణంగా ఎండిన ధాన్యం తడిచి పోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారని, మాగోస ఎవరికీ పట్టడం లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారని తెలిపారు. అధికారులకు, ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు కనపడటం లేదని అన్నారు. ఇలానే కాలయాపన చేసి చేస్తే ఉద్యమాలు చేసి రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.