calender_icon.png 14 May, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కందుకూరి గణేష్ ఎన్నిక

14-05-2025 12:00:00 AM

ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి): ఇటీవల హైదరాబాద్ విద్యానగర్ లో జరిగిన పిడిఎస్ యు రాష్ట్ర కమిటీ సమా వేశంలో పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా కందుకూరి గణేష్ ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు.

ఈ మేరకు మంగళవారం విద్యాన గర్ లో నూతనంగా ఎన్నికైన పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కందుకూరి గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ తనకు ఇచ్చిన బాధ్యతను తూచా  తప్పకుండా నెరవేరుస్తానని, శాస్త్రీయ విద్య సాధన కోసం పోరాటం చేస్తానని, విద్యార్థుల సమస్యల కోసం వారి హక్కుల పరిష్కారంకై కృషి చేస్తానని అన్నారు.

దోపిడీ పీడన అణిచివేత లేని మహోన్నత విలువలు కలిగిన సమ సమాజం కావాలని, అదే విధంగా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతున్న   సందర్భంలో స్కూల్ లోకి రాకముందే విద్యార్థులు స్కూళ్ల లో మౌలిక వసతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకోవాలని, అదే విధంగా పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్ లు సకాలంలో అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. తనను నమ్మకంతో ఎన్నుకున్న రాష్ట్ర  కమిటీ సభ్యులకు ఆయన సందర్భంగా కృతజ్ఞతలు తెలి యజేశారు.