calender_icon.png 6 December, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంకణాల రాజేశ్వర్‌కు కళా ఉత్సవం అవార్డు

13-02-2025 02:16:07 AM

రాజేశ్వర్‌ను సన్మానించిన నిర్మల్ ఎమ్మెల్యే

భీంగల్, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ సాంస్కృతిక కళా సంస్థ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కళలు, సాహిత్యం, సంస్కృతి, కవులు, కళాకారుల సమ్మేళనం (ఆట, పాట, మాట, ధూం ధాం) కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ కళాకారుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి వరకు కొనసాగింది.

కళా సంస్థ ఆహ్వానం మేరకు ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ ఈ సమ్మేళనంలో పాల్గొని ‘జీవితం‘ అనే కవితా శీర్షికన కవితా పఠనం చేసి అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత) కంకణాల రాజేశ్వర్ ను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను బహుకరించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక కళామండలి రాష్ట్ర అధ్యక్షురాలు పాట రాజశ్రీ, పాట మహేష్ తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన సాంస్కృతిక సారథి కళాకారుడు రాంపూర్ సాయి, తెలంగాణ సాంస్కృతి కోద్యమ కళాకారుడు పొగరి సంజీవ్, తెలంగాణ నలు దిక్కుల నుండి విచ్చేసిన కళాకారులు తదితరులు పాల్గొన్నారు.