calender_icon.png 25 October, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లిష్ డబ్బింగ్ వెర్షన్‌తో కాంతార: చాప్టర్1 రికార్డు

23-10-2025 01:25:20 AM

రిషబ్‌శెట్టి పాన్‌ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కాంతార: చాప్టర్ 1’. ‘కాంతర’కు ప్రీక్వెల్‌గా హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే. తెలుగులో ఈ సినిమా 100 కోట్లు వసూళ్లు సాధించగా, ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లు రాబట్టింది. కన్నడ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచి, అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమా మరో మైలురాయిని దాటనుంది. అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుందీ సినిమా. తద్వారా ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టిస్తోంది లేటెస్ట్ వెర్షన్‌లో రన్‌టైమ్ తగ్గించారు. 2 గంటల 45 నిమిషాల 40 సెకన్లు రన్ టైమ్ ఉంటుంది.