calender_icon.png 25 October, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితం

23-10-2025 01:27:04 AM

ప్రఖ్యాత రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రను తెరపైకి తీసుకువస్తున్నారు. పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి పేరు అందరికీ తెలిసిందే. ఇక గుమ్మడి నర్సయ్య పాత్రలో కరుణాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ కనిపించనున్నారు. పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్ సురేశ్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ పోస్టర్‌ను, మరో మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. పోస్టర్ చూస్తుంటే, గుమ్మడి నర్సయ్య పాత్రకు శివరాజ్‌కుమార్ ప్రాణం పోసినట్టనిపిస్తోంది. ఆ లుక్, వేషధారణ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇక మోషన్ పోస్టర్‌లో ఎమ్మెల్యేలు అంతా కారులో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌లో రావడం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి; కెమెరా: సతీశ్ ముత్యాల; ఎడిటర్: సత్య గిడుటూరి.