calender_icon.png 15 September, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

29న కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు

15-09-2025 12:53:46 AM

ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్‌గౌడ్

మేడిపల్లి, సెప్టెంబర్ 14  (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని బొమ్మక్ బాలయ్య గార్డెన్స్ లో విక్టరీ షాటకన్ కరాటే అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహెష్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కరాటే క్రీడల్లో ఒక భాగం అని,  శరీర ఎదుగుదలకు, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  పోటీలను నిర్వహిస్తే సహ కరిస్తామన్నారు. 29 సంవత్సరాలుగా జాతీ య  కరాటే పోటీలను నిర్వహిస్తున్న  అసోసియేషన్‌ను అభినందించారు.

ఈ కార్య క్రమంలో  మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మార్కె ట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పద్మా రెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.