కరీంనగర్ డైమండ్స్ హ్యట్రిక్ విక్టరీ
హైదరాబాద్, జూలై 2 : తెలంగామ టీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆరంభంలో వరు స ఓటములతో సతమతమైన ఆ జట్టు తాజాగా రంగారెడ్డి రైజర్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. రాహుల్ రాదేశ్37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72), సింహ 38 బం తుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లలో 60 పరుగులతో రాణించారు.
రంగారెడ్డి బౌలర్లలో తనయ్ జడ్డూ 2, నితిన్ సాయి యాదవ్, తనయ్ త్యాగరాజన్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్యఛేదనలో రంగారెడ్డి బ్యాటర్లు విఫలమయ్యా రు. ఆదిత్య జవ్వాజి 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జ్ఞానప్రకాశ్ రెడ్డి (23), ఆరోన్ జార్జ్ (19), నితిన్ సాయి యాదవ్ (15) పరుగులు చేశారు. చివర్లో ఆర్యన్ కరియప్ప 20 బంతులో 30 రన్స్ చేసినా ఫలితం లేకపోయింది. రంగారెడ్డి రైజర్స్ 20 ఓవర్లలో 172 పరుగులే చేయగలిగింది. కరీంనగర్ బౌలర్లలో నారాయణ తేజ 3, రత్లావత్ దినే శ్ 2, శుభమ్ శర్మ 2, ఆశిశ్ శ్రీవాత్సవ, సతీశ్ కుమార్ ఒక్కో పడగొట్టారు. ఐదు మ్యాచ్ల్లో రంగారెడ్డికి ఇది రెండో ఓటమి.






