3 July, 2026 | 1:06 AM

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఖరారు

03-07-2026 12:00 AM

కొలంబో, జూలై 2 : టీమిండియా శ్రీలం క పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ టూర్ లో భారత జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భా రత జట్టు శ్రీలంకకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుండి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది. అలాగే రెండో టెస్టు మ్యా చ్‌కు ఆగస్టు 23 నుండి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోరట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వ నుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ వరల్ టె స్ట్ ఛాంపియన్షిప్ 2025- సైకిల్లో భాగం గా జరగనుంది.లంకతో ఈ సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది.

ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ ప్రదర్శన అంతంత మాత్రంగా నే ఉంది. టీమిండియా ఇప్పటివరకు తొమ్మి ది మ్యాచ్‌లు ఆడగా, కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచి  పాయింట్ల పట్టికలో ఐదవ స్ధానంలో నిలిచింది.డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే శ్రీలంక గడ్డపై ఖచ్చితంగా సిరీస్ గెలవాల్సిందే. అయి తే లంకను వారి స్వదేశంలో ఓడించడం అం త ఈజీ కాదు. శ్రీలంక జట్టు గత కొంత కా లంగా సొంత గడ్డపై అద్భుత విజయాలతో అదరగొడుతోంది. గత 21 టెస్ట్ మ్యాచ్‌లలో 11 విజయాలను నమోదు చేసింది. కాగా 2017 తర్వాత భారత్ టెస్టుల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అప్పట్లో విరాట్ సారథ్యంలో భారత్ 3- సిరీస్‌ను కైవసం చేసుకుంది.