24-07-2025 08:26:31 PM
ప్రభుత్వము స్పోర్ట్స్ అథారిటీ తరఫున సహకారం అందేలా చూస్తా..
కబడ్డీ క్రీడకు పూర్వ వైభవం తెస్తాం నైపుణ్యమున్న క్రీడాకారులకు తగిన శిక్షణ అందిస్తాం..
అత్యుత్తమ ప్రతిభ కనబరచాలి..
కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు..
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కబడ్డీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ లో స్టార్లుగా ఎదగాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు(District Kabaddi Association Chairman Velichala Rajender Rao) సూచించారు. ఇందుకోసం క్రీడాకారులకు అవసరమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వము స్పోర్ట్స్ అథారిటీ తరఫున తగిన సహకారం అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బీచ్ ఇండియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ కు ఎంపికైన సాయిప్రియ, జాతీయస్థాయిలో కబడ్డీలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఎన్ వర్ష, ఏం దిలీప్, పవన్ కుమార్ అజ్జు తేజ, సుజ్జి అనే కబడ్డీ క్రీడాకారులను కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో గురువారం సాయంత్రం రాజేందర్ రావ్ ఘనంగా సన్మానించారు.
కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ కబడ్డీ క్రీడాకారులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని, ప్రభుత్వము, స్పోర్ట్స్ అథారిటీ తరఫున తగిన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో కబడ్డీ క్రీడ మరింత పూర్వ వైభవం సాధించేలా నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు తగిన శిక్షణ అందించి వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కబడ్డీ క్రీడాకారులకు తగిన వసతులు, సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పించేందుకు చొరవ చూపుతానని చెప్పారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపుతున్న క్రీడాకారులు ఇంటర్నేషనల్ లెవెల్ స్టార్లుగా ఎదిగి కరీంనగర్ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి తో రాజేందర్ రావు ఫోన్లో మాట్లాడారు.
కరీంనగర్ జిల్లాలో కబడ్డీ క్రీడాకారులకు తగిన శిక్షణ సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. అందుకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి సానుకూలంగా స్పందించారు. కరీంనగర్ జిల్లా కబడ్డీ క్రీడాకారులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కబడ్డీ క్రీడాకారులకు వ్యక్తిగతంగా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని రాజేందర్ రావు స్పష్టం చేశారు. కబడ్డీ క్రీడకు ఇప్పటికి మంచి క్రేజీ ఉందని, క్రీడాకారులు దీనిపై ప్రత్యేక ఆసక్తి కనబరచాలని రాజేందర్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నడి అమిత్ కుమార్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వైస్ చైర్మన్ సిహెచ్ సంపత్ రావు, జిల్లా కార్యదర్శి మల్లేశం గౌడ్, లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఆకుల నరసన్న, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.