calender_icon.png 19 May, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న కరీంనగర్ రైల్వేస్టేషన్ ప్రారంభం

19-05-2025 12:34:09 AM

 - వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, మే 18 (విజయ క్రాంతి): ఆధునికరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 22న వర్చువల్ గా ప్రారంభించనున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఈనెల 22న ప్రధానమం త్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారని, అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నారని తెలిపారు. తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు (బేగంపేట, వరంగల్, కరీంనగర్) ఉంటే అందులో మన కరీంనగర్ ఉండటం సంతోషంగా ఉందన్నారు.

కరీంనగర్ రైల్వే స్టేషన్ అద్బుతంగా మారిందని, కరీంనగర్ ఫ్రజలు మోదీకి రుణపడి ఉంటారన్నారు. త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను కూడా ఆధునీకరించబోతున్నారని, తీగలగుట్ట ఆర్వోబీ పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు.బడ్జెట్ కంటే అదనంగా మరో 2 కోట్లు వెచ్చించి రోడ్లు, ఇతర సౌకర్యలు కల్పిస్తున్నామన్నారు.

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రారంభించ బోతున్నామని తెలిపారు.ఉప్పల్ ఆర్వోబీ పనుల జాప్యంపై కాంట్రాక్టర్, అధికారులను మందలించామని,జూన్ నాటికి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వన్ లైన్ పను లను పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.

10 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్ల దుస్థితి మనందరికీ తెలుసునని, “అమ్రుత్ భారత్‌” పథకం కింద దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో దేశవ్యాప్తంగా 1350 రైల్వే స్టేషన్ల అభివ్రుద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో  2 వేల కోట్లతో 40 రైల్వే రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నయన్నారు.

ఆధునీకరణతో రైల్వే స్టేషన్ల రూ పురేఖలు మారిపోయాయన్నారు. “అమృత్ భారత్‌” కింద కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 33 కోట్ల 30 లక్షల రూపా యలు ఖర్చు చేశామని, 2023 ఆగస్టులో అభివ్రుద్ధి పనులు స్టార్ట్ చేసి 21 నెలల్లోనే పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు.

ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా 2 ఎంఎంటీఎస్ ప్లాట్ఫాంలు, లిఫ్టులు,  ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, ఏసీ వెయిటింగ్ హాళ్లు, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్ల ఏర్పాటు భేష్ అని కొనియాడారు. తెలంగాణలో రైల్వే అభివ్రుద్ధికి 32 వేల 940 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశామన్నారు.

ఈ ఒక్క ఏడాదే  5 వేల 336 వేల కోట్లు కేటాయింపు చేశామని తెలిపారు.నాచారం రైల్వే టెర్మినల్ ను అద్బుతంగా నిర్మించుకున్నామని, 750 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేష న్ పనులు కొనసాగుతున్నాయన్నారు. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తున్నమని తెలిపారు.

కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు అభివ్రుద్ధి పనులే నిదర్శనమనీ తెలిపారు. జాతీ య రహదారుల కోసమే లక్షన్నర కోట్లు ఖ ర్చు ఖర్చు చేశామన్నారు. తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించాం? ఏ విధమైన అభివ్రు ద్ది చేశామనే అంశంపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని,  రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. విమర్శలకే పరిమితం కావడం సరికాదని తెలిపారు.కరీంనగర్ నుండి తిరుపతి రైలు డైలీ సర్వీస్ సాధ్యాసాధ్యాలను రైల్వే శాఖ పరిశీలిస్తోందని అన్నారు. కరీంనగర్ నుండి జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పను లు మరో 3 నెలల్లో టెండర్లు ప్రారంభం కా బోతున్నయని,  ఈ అంశంపై కేంద్ర మంత్రి గడ్కరీతోనూ ఇటీవల మాట్లాడానని బండి సంజయ్ కుమార్ తెలిపారు.