calender_icon.png 11 September, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 పరీక్షల్లో న్యాయం జరగాలి

11-09-2025 07:52:59 PM

బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి శేఖర్ బాబు..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్(Public Service Commission) విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ టిజిపిఎస్సి చైర్మన్ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని మానకొండూరు నియోజకవర్గ బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టులు చేయడం కాదు గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీవో నెం 29 రద్దు చేయాలని జీవో నెం 55  అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.