11-09-2025 07:55:50 PM
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెక్రెటరీ సీతాలక్ష్మి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల ప్రతిభ వెలికితీసే వేదికగా ఈఎంఆర్ఎస్ రాష్ట్రస్థాయి క్రీడలు నిలుస్తున్నాయని, చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్(Tribal Welfare Residential Schools) సెక్రటరీ సీతాలక్ష్మి అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పోగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో రాష్ట్రవ్యాప్తంగా 23 ఎకలవ్య పాఠశాలల విద్యార్థులతో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీతాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, సరైన మార్గంలో నడిచేందుకు గిరిజన సంక్షేమ శాఖ కృషి చేస్తోందన్నారు. సమాజం పట్ల గౌరవంతో ఉండి, ప్రత్యేక గుర్తింపు సాధించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపుకు తొలిమెట్టు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ మాదవి దేవి, ఓఎస్డి శ్రీనివాస్, రామారావు, గంగాధర్, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్య నాయక్, ఆర్ సి ఓ రత్న కుమారి, పాఠశాల ప్రిన్సిపాల్ అజయ్ సింగ్, కల్పన పాల్గొన్నారు.