11-09-2025 07:42:51 PM
పిఎసిఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి.
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు యూరియా అందేల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గురువారం మరిపెడ మండల ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి(PACS Chairman Chapala Yadagiri Reddy), వ్యవసాయ శాఖ ఏడిఏ విజయ్ చందర్ రెడ్డి, ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, తహసిల్దార్ క్రిష్ణవేణి, ఏవో వీరాసింగ్, తదితరులతో కలిసి సొసైటీ ద్వారా రైతులకు అందిస్తున్న యూరియా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరాకు సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయుటకు పకడ్బందీ చర్యలు తీసుకొని ప్రతి ఒక రైతుకు యూనియన్ అందించడం జరుగుతుందని మరిపెడ క్లస్టర్ కు సంబంధించి రైతుల వివరాలు సేకరించి అందుకు అనుగుణంగా యూరియాను పంపిణీ చేస్తున్నామని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈరోజు అబ్బాయి పాలెం, తాళ్ల ఊకళ్, వెంకంపహాడ్, ఎల్లంపేట, ఉల్లేపల్లి, తదితర గ్రామాల సొసైటీలకు పంపిణీ చేయడం జరిగిందని, రైతులు అనవసర వదంతులు నమ్మవద్దని యూరియా కావలసినంత ప్రభుత్వము నుండి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రైతుల వివరాల ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు సహకార శాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళికలతో ప్రతి ఒక రైతుకు యూరియా అందెందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. రోజువారి వచ్చే యూరియా వివరాలు సమాచారం రైతులకు అందిస్తూ ఎలాంటి ఇబ్బందికర పరిస్తితులు లేకుండా చర్యలు తీసుకున్నాం జరుగుతుందని, కేంద్రాలలో త్రాగునీరు టెంటు చైర్స్ సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. యూరియా తీసుకుంటున్న రైతు యొక్క అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.