11-09-2025 07:44:53 PM
టిఆర్ఎస్వి నాయకుల డిమాండ్..
తాండూరు (విజయక్రాంతి): గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ లో భారత రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం(BRSV) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. జీవో నెం 29 రద్దు చేసి జీవో నెం 55 ఇంప్లీమెంటేషన్ చేయాలని డిమాండ్ చేశారు.