calender_icon.png 11 September, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యాసంస్థలకు సన్న బియ్యం మాత్రమే సరఫరా అయ్యేలా చూడాలి

11-09-2025 08:03:31 PM

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్..

వనపర్తి టౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థలకు నాణ్యమైన సన్న బియ్యం మాత్రమే సరఫరా అయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్(Additional Collector Revenue Kheemya Naik) ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో జిల్లా పౌరసరఫరాల సంస్థ డిఎం జగన్ తో కలిసి అన్ని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల డీసీవోలతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థలకు నాణ్యమైన సన్న బియ్యం మాత్రమే సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు.

నాణ్యతలేని బియ్యం వస్తే వాటిని వెంటనే వెనక్కి పంపించేయాలని సంక్షేమ గురుకులాల అధికారులకు సూచించారు. ఈ విషయంపై ఆయా వసతి గృహాల ఇన్చార్జిలకు గట్టిగా సూచించాలని తెలియజేశారు. బియ్యం విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే గురుకులాల ఇన్చార్జులు, డీసీవో లు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలేని బియ్యాన్ని విద్యార్థులకు పెట్టడానికి వీలు లేదని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా మైనారిటీ అధికారి అఫ్జలుద్దీన్, డిసీజీవో శుభ లక్ష్మి, డిసిఒలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.