08-09-2025 12:00:00 AM
మణికొండ, సెప్టెంబర్ 7 : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శివపురి కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. శివపురి కాలనీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంపాటలో మాలేల మహేష్ గౌడ్ అనే భక్తుడు అత్యధికంగా రూ. 2,20,000/- పలికి గణనాధుని లడ్డూను దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దేవేందర్ సాగర్, సత్యనారాయణ, బాలకృష్ణ, నాగిరెడ్డి, కృష్ణ, కె. కురుమూర్తి తదితరులు కీలక పాత్ర పోషించారు. అనంతరం నిర్వహించిన మహాగణపతి శోభాయాత్రలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో శివపురి కాలనీ వీధులు మార్మోగాయి.