04-11-2025 03:47:36 PM
							నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని నిర్మల్ టీజీ ఆర్టీసీ డిపో పరిధిలో బుధవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు నిర్మల్ డిపో పరిధిలోని ఆయా రూట్లో బస్ సర్వీసులు ప్రయాణికులకు సదుపాయాలు సూచనలు సలహాలు బస్సు సర్వీసుల పునరుద్ధరణ తదితర అంశాలపై ప్రజలు ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదిస్తే సమాధానాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. డయల్ యువర్ డీఎం నేరుగా డిపోమేనేజర్ తోటే మాట్లాడవచ్చని ఆయన పేర్కొన్నారు. 05.11.2025 రోజు ఉదయం 11 గం!! ల నుండి 12 గం!! ల వరకు 9959226003 లో మాట్లాడాలని ఆయన తెలిపారు.