25-10-2025 12:16:01 AM
కరీంనగర్ అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్
చిగురుమామిడి, అక్టోబర్ 24(విజయక్రాంతి): వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ ఆదేశించారు. చిగురుమామిడి మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దవాఖానలో ఓపీ రిజిస్టర్, రికార్డులు, ల్యాబ్ రూమ్, ఫార్మసీ రూం, సిబ్బంది పనితీరును మండల వైద్యాధికారి రాజేష్ ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పరీక్షల కోసం వచ్చి న వారితో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. వీరి వెంట మండల వైద్యాధికారి సన్నిల్ల రాజేష్, వైద్య సిబ్బందిఉన్నారు.