31-07-2025 12:00:00 AM
నారాయణఖేడ్, జూలై 30: కాశీ జగద్గురు శివానంద చార్య బుధవారం నారాయణఖేడ్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జంగమ సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. అనంతరం స్థానిక బసవ మండపంలో జగద్గురు యొక్క ప్రవచనాలు, ప్రత్యేక లింగ పూజ కార్యక్రమాలు ఇతర దీక్ష కార్యక్రమాలు ఘనంగా కొనసాగినాయి. అనంతరం జగద్గురు మాట్లాడుతూ భక్తులందరూ ధర్మ సమాజ స్థాపనకై పాటుపడాలని సూచించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి జంగమ సమాజ నాయకులు, టి పి సి సి సభ్యుడు శంకరయ్య స్వామి, సిద్దయ్య స్వామి, నరేష్ స్వామి ఆనంద్ స్వామి, శ్రీకాంత్ స్వామి, సత్య సాయి సేవ సమితి నాయకులు శంకరప్ప, నారాయణఖేడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కార్, బిజెపి నాయకులు రజినీకాంత్, మాజీ సర్పంచ్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.