calender_icon.png 23 August, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశ్మీర్ గడ్డ రైతు బజార్ సమీకృత మార్కెట్ ను వేగవంతంగా పూర్తి చేయాలి

23-08-2025 05:54:53 PM

మాజీ మేయర్ వై సునీల్ రావు

కరీంనగర్ (విజయక్రాంతి): కాశ్మీర్ గడ్డ రైతు బజార్ సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపి నాయకులు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కాంట్రాక్ట్ ఏజెన్సీని ఆదేశించారు. శనివారం కాశ్మీర్ గడ్డ రైతు బజార్ మార్కెట్ ను సందర్శించారు. నగరపాలక సంస్థకు చెందిన 10 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... కాశ్మీర్ గడ్డ సమీకృత మార్కెట్ నిర్మాణం నాణ్యతతో పూర్తి చేసి... ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. ఇప్పటికే మార్కెట్ నిర్మాణం పనులు చాలా ఆలస్యం అయ్యాయని... వేగవంతంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

డిజైన్ మ్యాప్ లో పొందుపరిచిన ప్రకారం సమీకృత మార్కెట్ లో వసతులు, సౌకర్యాలను కల్పిస్తూ.... పనులు చేయాలని కోరారు. ఇందులో సెల్లార్ నిర్మాణం కూడ చేపడుతున్న నేపథ్యంలో... వరద నీరు సెల్లార్ లోకి వెళ్లకుండ నిర్మాణం లో తగిన జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వచ్చే ప్రజలకు, మార్కెట్ లో కూరగాయలు అమ్మకాలు చేసే వ్యాపారుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, స్త్రీలకు, పురుషులకు వేరు వేరుగా మాడ్రన్ మాడల్ లో మరుగుగొడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పోరేటర్ తుల శ్రీదేవి చంద్రమౌళి, ఏజెన్సీ కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.