23-08-2025 05:48:50 PM
చౌటుప్పల్,(విజయక్రాంతి): చౌటుప్పల్ లోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల యందు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర ఆగస్టు 23, 2023 న చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ ను దింపిన ఘనత భారతదేశానికి దక్కింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల రాకెట్ల నమూనాలను మరియు విక్రం ల్యాండర్ నమూనాలను తయారుచేసి వాటి పనితీరును చక్కగా ప్రదర్శించి అందరికీ వివరించారు . సోలార్ సిస్టం ను కూడా ప్రదర్శించారు.
ఆస్ట్రోనాట్స్ వేషధారణలో విచ్చేసిన విద్యార్థులు అలరించారు. అదేవిధంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకొని. విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్పర్సన్ శ్రీ బండి వీణా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు స్ఫూర్తి పొందుతారని మరియు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కలుగుతుందని, భారత కీర్తి ప్రతిష్టలు తెలియవస్తాయని పేర్కొన్నారు. పాఠశాల డైరెక్టర్ ఎస్ లక్ష్మి విద్యార్థుల ప్రతిభను కొనియాడారు వారికి సహకరించిన తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ప్రశంసించారు.