calender_icon.png 19 May, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిపెద్ద చేనేత కార్పెట్

04-05-2024 12:27:43 AM

కశ్మీర్ చేతి వృత్తి నిపుణుల సృష్టి

శ్రీనగర్, మే 3: కశ్మీర్ కార్పెట్లు, శాల్వాలంటే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా చెప్పలేనంత క్రేజ్ ఉన్నది. ఇక్కడి చేతివృత్తి నిపుణులు తయారుచేసే కార్పెట్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజభవనాల్లో కూడా అలంకరించబడ్డాయి. తాజాగా కశ్మీరీ నిపుణులు ప్రపంచంలో అత్యంత పెద్ద చేనేత కార్పెట్‌ను తయారుచేసి రికార్డు సృష్టించారు. ఇది ఏకంగా 2880 చదరపు అడుగులు ఉన్నది. దీనిని తయాచేసేందుకు 25 మంది చేతివృత్తి కళాకారులకు 8 సంవత్సరాలు పట్టింది. ఉత్తర కశ్మీర్‌లోని క్రాల్‌పోరా ప్రాంతంలో ఉన్న వాయిలి గ్రామంలో ఈ బాహుబలి కార్పెట్‌ను రూపొందించారు. ఇది 71 అడుగుల పొడవు, 40 అగుడుల వెడల్పు ఉన్నది. ‘మనదేశంలోని వ్యక్తే ఈ భారీ కార్పెట్‌కు ఆర్డర్ ఇచ్చాడు. ఇంతపెద్ద కార్పెట్‌ను మేము గతంలో ఎప్పుడూ తయారుచేయలేదు. దీనికోసం ఎంతో కష్టపడ్డాం. దేవుడి దయవల్ల విజయవంతంగా తయారుచేశాం. దీనిని విదేశాల్లో అమ్మబోతున్నట్టు భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద కార్పెట్‌ను తయారుచేస్తాం’ అని కార్పెట్ డీలర్ ఫయాజ్ అహ్మద్ షాషా తెలిపారు.