20-05-2025 01:55:25 AM
గత ప్రభుత్వంలో గిరిజన రైతులకు బేడీలు.. నేడు అధికారాలు!
* ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత పాలకులు.. ఇప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం వారికి మింగుడు పడటం లేదు. అందుకే వారు పెంచి పోషించే సోషల్ మీడియాను వాడుకొని ప్రజాప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తు న్నారు. మట్టి పిసికేటోళ్లకు పాలించడం చేతకాదంటూ హేళన చేస్తున్నా రు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్రమే మెచ్చుకునే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని గమనించాలి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, మే 19 (విజయక్రాంతి): గిరిజనులు ఆత్మగౌరవంతో హక్కుదారులు గా బతికేలా భూమి పొరల్లోంచి సాగునీటిని వెలికితీసి పంటలు పండించే ‘ఇందిరా సౌర జలగిరి వికాసం’ పథకాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలి పారు. అందుకు రాష్ట్రంలోని రెండు లక్షల పదివేల మంది గిరిజన రైతులకు రూ. 12,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూలో నాలో చేసుకొని వలస వెళ్లి బతికిన పాలమూరు బిడ్డలే నేడు ప్రభుత్వాన్ని పాలిస్తుండటంతో గత పాలకులకు మింగుడు పడటం లేదని దుయ్యబట్టారు.
జల్, జమీన్, జంగల్, దున్నేవాడిదే భూమి అంటూ పోడు భూములకు హక్కులు కల్పించాలని ఉద్యమాలు చేసిన గిరిజన రైతులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బేడీలు వేసి అవమానపరిచిందని, నేడు ప్రజాప్రభుత్వం వారికి అధికారాలు కల్పిస్తోందని చెప్పారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద సుమారు 28మంది గిరిజన రైతులకు చెందిన 50 ఎకరాల్లో 186 సోలార్ 5 హెచ్‌పీ పంపుసెట్లను ఏర్పాటు చేసి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవితో పాటు స్థాని క ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలిసి లాంఛనంగా పథకాన్ని ప్రారంభించారు.
అనంతరం గ్రామంలోని రామాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.. రాష్ట్రంలోని కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకు తగిన ట్లుగా ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు ఇలా అన్ని రంగాల్లో మహిళల ను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఒక మహిళ
ఆర్థికంగా నిలదొక్కుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని అలాంటిది రాష్ట్రంలోని కోటి మంది మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులుగా మారితే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని ఆకాంక్షించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలోనూ మహిళలకు అవకాశం కల్పిస్తూ ఆదానీ, అంబానీలతో పోటీపడే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఆడబిడ్డలకు హైదరాబాద్ శిల్పారామం పక్కన స్థలం కేటాయించి వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలు కల్పించిందన్నారు.
నల్లమల బిడ్డగా గర్వపడుతున్నా..
ఒకప్పుడు నల్లమల్ల ప్రాంతం అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతమని..ఎవరో వచ్చి అభివృద్ధి చేయాలనేవారు..ప్రస్తుతం ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతానికి చెందిన బిడ్డగా ముఖ్యమంత్రిగా వచ్చి అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించిన మ హేంద్రనాథ్, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా రాణించిన జైపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పుట్టిన ప్రాంతమని...ఈ విషయంలో తాను నల్లమల్ల బిడ్డగా ఎంతో గర్వపడుతున్నానన్నారు. ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ సహచర మంత్రి వర్గంతో కలిసి చేయడం సంతోషమని..అప్పట్లో తాను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను గెలించాలని ఎన్నికల సమయంలో కోరగా అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారని.. ప్రస్తుతం 65 మంది శాసనసభ్యులు ఉండ టం వల్ల తాను నల్లమల బిడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. అత్యంత వెనుకబడిన నల్లమల ప్రాంతంలో సాగు చేసుకుంటున్న విద్యుత్ మోటార్లకు సోలార్ ప్యానల్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ అచ్చంపేట ప్రాంతాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పాలమూరు వాసులకు మట్టి పిసుక్కోవడం, తట్టా పారా పట్టుకోవడం మాత్రమే తెలుసునని అలాంటివారికి పాలించడం చేతకాదంటూ ప్రతిప క్షాలు హేళన చేస్తున్నాయన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత పాలకులు.. ఇప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో వారికి మిం గుడు పడటం లేదని, అందుకే వారు పెంచి పోషించే సోషల్ మీడియాను వాడుకొని ప్రజాప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. మట్టి పిసికేటోళ్లకు పాలించడం చేతకాదంటూ హేళన చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకునే పరిస్థితి వచ్చిన విషయాన్ని వారు గమనించాలని సూచించారు.
అచ్చంపేట అభివృద్ధికి
ప్రత్యేక ప్రణాళికలు..
కష్టమంటే తెలిసిన వ్యక్తిని కాబట్టే పేదల కష్టాన్ని అర్థం చేసుకొని సహచర క్యాబినెట్ మంత్రుల సంపూర్ణ సహకారంతోనే పరిపాలన విజయవంతంగా సాగిస్తున్నట్లు రేవం త్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఎంత బాధ్యత ఉందో తనకు ముఖ్యమంత్రిగా అంతే బాధ్యత ఉందని..అచ్చంపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని... నిధులు విడుదల చేయాలని... ఈ ప్రాంతంలో ఉద్యోగ, విద్య ను అందించాలని మంత్రులకు తెలియజేశానన్నారు. ఈ ప్రాంతంలో రైతన్నలు దున్ను కుంటే పోడుభూములు బంజరు భూములుగా మారాయని, ప్రస్తుతం గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ఎంతో లాభం చేకూరుస్తుందన్నారు. అలాగే ఇండ్లకు, వ్యవసాయ అవసరాలకు సోలార్ విద్యుత్తుపై అవగాహన కల్పించడంతో పాటు సోలార్‌తో విద్యుత్తు అవసరాలు తీర్చుకునేలా ఇళ్ళకు సైతం ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు ఆదేశాలిచ్చినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ సోలార్ పంపుసెట్లను రాబోయే వంద రోజు ల్లో ఉచితంగా అందచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
నల్లమలను లూటీ చేయాలని చూశారు: ఎమ్మెల్యే వంశీకృష్ణ
ప్రకృతి అందాలు, పర్యాటక ప్రదేశాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉన్న ఊటీలాంటి నల్లమల ప్రాంతాన్ని గత పాలకులు లూటీ చేయాలని చూశారని అచ్చం పేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపించారు. ప్రస్తుతం ప్రారంభమైన మాచారం ఇందిర సౌర గిరి జలవికాసం పథకంతో గిరిజనులకు ఎంతో మేలు చేకూరుతుందని, దాంతో పాటు నియోజకవర్గంలో ఉమామహేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేయాలని కోరారు. మద్దిమడుగు వద్ద తీగల వంతెన ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. నల్లమలను టూరిజం హబ్‌గా మార్చేందుకు సుమారు 100 కోట్లు మంజూరు చేయాలని, రోడ్ల విస్తరణ, కళాశాలల ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత ప్రతి పాదికన గిరిజనుల కోసం పీవో పోస్టు మంజూరు చేయాలని కోరారు.
కొండారెడ్డిపల్లిలో సీఎం..
నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగం గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో శ్రీఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభస్వాగతం పలికారు. అనం తరం ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, అనసూయ (సీత క్క), కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ప్రధాని అంటే
ఇందిరమ్మలా ఉండాలి..
పహల్గాం దాడి విషయంలో ప్రధానమంత్రి ఎలా ఉండాలంటే ఇందిరాగాంధీ 54 సంవత్సరాల క్రి తంలా ఉండాలని ప్రతి ఒక్కరికీ తెలిసివచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి కొని యాడారు. ప్రతీ పేదవారి గుండె ల్లో, తండాల్లో, గూడేల్లో ఇందిరాగాంధీ ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశం లోనే ఆదర్శంగా నిలుపుతానని... అందు కు 24 గంటల పాటు శ్రమిస్తానని దీనికై ప్రతి ఒక్కరి ఆశీస్సులు అవసరమన్నారు. అనంతరం అచ్చంపేట నియోజకవర్గానికి రూ.119 కోట్ల తో స్వయం సహాయక బృందాలకు ముఖ్యమంత్రి అందజేశారు. గిరిజనులకు మంచి చేసే తెలంగాణ గిరి జన సంక్షేమ శాఖ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు జ్ఞాపికలను అందజేశారు.
సన్నబియ్యంతో ఆత్మగౌరవం..
ప్రస్తుతం రేషన్‌లో అందిస్తున్న సన్న బియ్యం ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగా మారిందని సీఎం రేవంత్ చెప్పారు. రైతులు పండించిన సన్నవడ్లను తిరిగి ప్రజలకు సన్న బియ్యంగా అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని...గృహజ్యో తి, మహాలక్ష్మీ పథకాల ద్వారా లబ్ధి జరుగుతోందన్నారు. రైతులను, నిరుద్యోగులు, విద్యార్థులను ఆదుకున్న ఘనత తమకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు 60 వేలు ఇవ్వగా ప్రైవే ట్ ఉద్యోగాల్లో కూడా చోటు కల్పించినట్లు తెలిపారు. పేదలకు 25 లక్షల ఎకరాల భూ ములను అందించి వారి ఆత్మగౌరవాన్ని కా పాడిన ఘనత తమకే దక్కుతుందన్నారు.