17-09-2025 10:47:22 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): చేతి వృత్తి కులాలకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కృషి చేసానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. విశ్వకర్మ ఆలోచన విధానం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ ఆరాధనోత్సవాల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. మొదట కమిటీ సభ్యులతో కలిసి విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు.
విశ్వకర్మ విగ్రహానికి, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జోగు రామన్న ప్రసంగిస్తూ వీర బ్రహ్మేంద్రస్వామి ఆలోచన విధానంతో సృష్టికర్మ యావత్ జీవన విధానం కొనసాగుతుందని అన్నారు. కులవృత్తులకు జీవం పోసిన విశ్వకర్మలు ఆలోచన విధానం ఎంతో స్ఫూర్తివంతమైందన్నారు. బీసీలోని 27 కుల సంఘాలకు చెందిన బీసీ భవన్ ను నాలుగున్నర ఎకరాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూమి పూజ చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు.