05-11-2025 05:03:54 PM
విశిష్ట కలిగిన కార్తీక పున్నమి..
శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ..
గరిడేపల్లి (విజయక్రాంతి): కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమి రోజు బుధవారం మండలంలోని కీతవారిగూడెం గ్రామంలోనీ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు తెల్లవారుజాము నుండే శివనామస్మరణతో భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తుల రాకతో పండగ వాతావరణం సంతరించుకుంది. భక్తులు తెల్లవారుజామునుండే దేవాలయం నందు ఉదయం సుప్రభాత సేవ స్వామి వారికి మహాన్యస్య పూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం సహస్రనామార్చనము అమ్మవారికి కుంకుమ పూజ విశేష పుష్పాలంకరణ వివిధ హారతులు దేవాలయ కమిటీ వారిచే నిర్వహించడం జరిగిందని దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రాయప్రోలు భద్రయ్య శర్మ, శ్రీరామయ్య శర్మ,వెంకటేశ్వర శర్మ, అనిల్ కుమార్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు జుట్టుకొండ చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి తోడుపునూరి కృష్ణమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు