calender_icon.png 5 November, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాముని బండ ఆలయ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన

05-11-2025 05:01:42 PM

రాముని బండ పవిత్ర క్షేత్రం - కప్పర భాను ప్రకాశ్ రావు

మాజీ సర్పంచ్ తీగుల్..

జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి రాముని బండ జాతర సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆచార్యులు జగన్నీవాస చారి ఆధ్వర్యంలో ఆలయం వద్ద రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు, రాజగోపుర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అనంతరము స్వామి వారికి అభిషేకాలు, అష్టోత్తర నామాలు కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజగోపురం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తీగుల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు మాట్లాడుతూ ఈ దైవకార్యక్రమం రాజగోపుర నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించి ఈ నిర్మాణం పూర్తి అయ్యేవరకు సహకరించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నివిధాలుగా నిర్మాణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

రామునిబండ ఆలయం పవిత్ర క్షేత్రం అని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమార్, గ్రామ పెద్దలు ఆలయ కర్తలు రవీందర్ రెడ్డి, ప్రొద్దుటూరు శ్రీనివాస్, చారీ, పిఎసిఎస్ చైర్మెన్ ఆలెటి ఇంద్రసేన రెడ్డి, హన్మంత రెడ్డి, ముదిరాజు సంఘం అధ్యక్షులు కొండయ్య, ప్రశాంత్, లక్ష్మన్ రాజు, బునారి వెంకటేష్,ఆలయ నిర్మాణ దాతలు గ్రామస్తులు, యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.