calender_icon.png 5 November, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కాంగ్రెస్ నేతలు..

05-11-2025 05:06:29 PM

ఉప్పల్ (విజయక్రాంతి): మల్లాపూర్ డివిజన్లోని ఓల్డ్ మల్లాపూర్ ఎస్పీనగర్ కాలనీలో సీఎం నిధులతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్డు పనులను బుధవారం కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కొద్ది సంవత్సరాలుగా ఎస్పీనగర్ ఓల్డ్ మల్లాపూర్  రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీవాసులు విన్నవించుకున్నారని దీనిగాను ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరయ్య అయ్యేలా చొరవ తీసుకున్నారని అనిల్ తెలిపారు. నిధులు మంజూరు కావడంతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో స్థానిక కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.