28-01-2026 12:20:16 AM
జయంతి సభలో వక్తల డిమాండ్
ఖైరతాబాద్, జనవరి 2౭ (విజయక్రాంతి): తెలంగాణ కోసం పోరాడిన గొప్ప సోషలిస్ట్ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ విగ్ర హం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా సంఘాలు, లోహియా విచార్ మంచ్, తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి, అనుచరులు, అభిమానుల ఆధ్వర్యంలో మం గళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ 93వ జయంతి సభ జరిగింది.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన అంటే తెలియని వారు ఎవరూ లేరని, ప్రజల కోసం పోరాడిన గొప్ప సోషలిస్ట్ నా యకుడు ఆయన అని వక్తలు అన్నారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పదవులు, అధికారం కోసం ఎప్పుడూ తాపత్రయ పడలేదన్నారు.ఆయన కార్యాచరణను, జీవితాన్ని,ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
నగరంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, డాక్టర్ సందీప్ పాండే,మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, విమలక్క, సుభద్రారెడ్డి, పాశం యాదగిరి, న్యాయవాది చంద్రశేఖర్, ప్రఫుల్ రాంరెడ్డి, పృథ్వీరాజ్ యాదవ్, సూర్యకిరణ్, రఫీ, సాయిరాం, మోహన్ బైరాగి, డి.రాజు గౌడ్, సొగరా బేగం పాల్గొన్నారు.