23-04-2025 10:21:42 AM
అత్యధిక మార్కులలో జూనియర్ కళాశాల
పాస్ పర్సంటేజ్ లో కేజీబీవీ కళాశాల ముందంజ
చర్ల ,(విజయ క్రాంతి) : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో చర్ల మండలానికి చెందిన కేజీబీవీ విద్యార్థులు మొదటి సంవత్సరం 90% రెండవ సంవత్సరం 100% పరీక్ష ఫలితాలు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల చర్ల మొదటి సంవత్సర విద్యార్థులు జనరల్ గ్రూపులో 40% ద్వితీయ సంవత్సర విద్యార్థులు జనరల్ గ్రూప్ లో 35% విద్యార్థులు పాస్ పర్సంటేజ్ సాధించారు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీ మొదటి సంవత్సరం 470 మార్కులకు గాను 464 తనుష్య మార్కుల సాధించింది , మొదటి సంవత్సరం ఎంపీసీ 470 మార్కులకు గాను 460 మార్కులు శ్రీ మేధా సాధించింది, ఎంపీసీ సెకండ్ ఇయర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 925 మార్కులు సిహెచ్ నందిని సాధించింది, ఒకేషనల్ సెకండియర్ ఎం పి హెచ్ డబ్ల్యు 1000 మార్కులకు గాను 945 మార్కులు ఎం సుజాత సాధించింది, మొదటి సంవత్సరం ఒకేషనల్ గ్రూప్ నుండి 500 మార్కులకు గాను 484 మార్కులు ఎస్ రాజేందర్ సాధించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధిక మార్కులతో ఫలితాలు మండల వ్యాప్తంగా సాధించడం పట్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర , కేజీబీవీ ప్రిన్సిపాల్ ఆర్ భాను ప్రియాంక విద్యార్థులను అభినందించారు.