18-05-2025 01:35:00 PM
హైదరాబాద్: షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్ హౌస్(Gulzar House)లో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి(Fire Department DG Nagireddy) తెలిపారు. ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయని, షార్ట్ సర్క్యూట్ తో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. మొదటి అంతస్తులో ఉన్న 17 మందిని ఆసుపత్రికి తరలించామని, నిచ్చెన ద్వారా నలుగురు పైనుంచి కిందకి వచ్చారని పేర్కొన్నారు. భవనంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన మెయిన్ వద్ద నిత్యం షార్ట్ సర్క్యూట్ జరుగుతోందని కార్మికులు చెబుతున్నారన్నారు. అగ్నిప్రమాద నివారణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని డీజీ నాగిరెడ్డి వివరించారు.