23-04-2025 11:23:59 AM
చిట్యాల,(విజయక్రాంతి): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై మూడు వీధి కుక్కలు దాడి చేసిన అత్యంత దారుణ ఘటన మండలంలోని జడల పేట గ్రామం(Jadalapet village)లో బుధవారం జరిగింది.గ్రామస్తులు,కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు. గ్రామానికి చెందిన రత్నం రమేష్ కూతురు నైనీషా ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో అటువైపుగా మూడు వీధి కుక్కలు ఒకసారిగా వచ్చి చిన్నారిపై దాడి(Dog Attack) చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.కాగా కుక్కల దాడిలో చిన్నారి భుజానికి తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.