06-09-2025 11:48:26 PM
ఫోక్సో చట్టం, బాలికల హక్కులపై అవగాహన కల్పించిన శిశు సంక్షేమ శాఖ
గంభీరావుపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు ఫోక్సో చట్టం, బాలల హక్కులపై శనివారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసు వర్కర్ సాయిరాం చిన్నారులు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలు, ప్రమాదాలు, అవి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్ గురించి ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరించారు. ఫోక్సో చట్టం, బాలల హక్కులపై సవివరంగా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని సూచించారు. పిల్లలు తమ సమస్యలను నిశ్శబ్దంగా భరించకుండా ధైర్యంగా బయటపెట్టాలని, అలాంటి సందర్భాల్లో తల్లితండ్రుల సహాయం కోరాలని పిలుపునిచ్చారు.