10-10-2025 05:35:57 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ఈనెల 28న చౌటుప్పల్ జరిగే కల్లుగీత కార్మిక సంఘం నాల్గవ భువనగిరి జిల్లా మహాసభలకు గీత కార్మికుల అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బావండ్లపల్లి బాలరాజు, మండల కార్యదర్శి ఎర్ర రవీందర్ కోరారు. శుక్రవారం రామన్నపేట రహదారి బంగ్లాలో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ నిరంతరం గీత కార్మికుల పక్షాన పోరాడుతూ తాటి చెట్టు మీద నుండి పడి మరణించిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా అందించాలని ఆయన కోరారు.
ద్విచక్ర వాహనాలు గీతలకు బీమా అందివ్వాలని ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించి గ్రామాల్లో విచ్చల వేడిగా వెలసిన బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆయన కోరారు. సొసైటీలో సభ్యత్వం కలిగిన ప్రతి గీత కార్మికుడికి 50 సంవత్సరాలు నిండిన వారికి 4 వేల పెన్షన్ ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో జరిగే జిల్లా మహాసభలో జిల్లా వ్యాప్తంగా గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాటాలకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మండల కోశాధికారి మునికుంట్ల లెనిన్, నాయకులు బాలగోని నరసింహ లగ్గోని యాదయ్య బోయపల్లిరామలింగయ్య,గుండు లింగయ్య, గిరికల శంకరయ్య,వీరమల్ల ముత్తయ్య,వీరమల్ల నరసింహ, ఆకిటి స్వామి, గోపగోనిగోపాల్,నరసింహ,గోపగోని శంకరయ్యతదితరులు పాల్గొన్నారు.