calender_icon.png 10 October, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస హత్యలతో సంచలనం రేపుతున్న రామగిరి మండలం

10-10-2025 05:31:13 PM

సెంటినరీకాలనీలో యువకుడి దారుణ హత్య

రామగిరి,(విజయక్రాంతి): వరుస హత్యలతో సంచలనం రేపుతుంది రామగిరి మండలం,  మండలంలోని సెంటినరీ కాలనీ సి-2 క్వార్టర్స్ లో శుక్రవారం మధ్యాహ్నం కోట చిరంజీవి(38) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల కథనం ప్రకారం... న్యూమారేడుపాక పోతనకాలనీకి చెందిన చిరంజీవి మీసేవ నిర్వాహకుడు. కాగా సెంటినరీకాలానీలోని ఐకేపీ కార్యాలయానికి చేరుకోగా అప్పటికే ఆ కార్యాలయానికి వచ్చిన ముగ్గురు దుండగులు రాళ్ళతో తీవ్రంగా కొట్టిచంపినట్లు తెలిసింది. మృతుని భార్య మృతి చెందగా అతను వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉంటుండటమే ఈ  హత్యకు కారణంగా తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.