10-10-2025 05:39:46 PM
ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోనితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తుంగతుర్తి మండల శాఖ కార్యవర్గం 2025-28 నకు నూతన కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమైతున్న అని ధ్వజమెత్తారు.