calender_icon.png 9 August, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద నీటిలో కాగితం పడవలతో ఆడుకుంటున్న ఎన్జీవోస్ కాలనీ చిన్నారులు

09-08-2025 08:45:00 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట(Chegunta) పట్టణ కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలోని, ఈరోజు పడ్డ వర్షానికి పూర్తిగా రోడ్డు మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. వర్షపు నీటి వరదలో కాగితపు పడవలతో ఆడుకున్న చిన్నారులు, ఈ కాలనీలో ఎప్పుడు వర్షం పడ్డ ఇదే పరిస్థితి. చిన్నగా వర్షం పడితే రోడ్డుపైకి మోరిలోని బురద మొత్తము వచ్చి రోడ్డుపైన నిలుస్తుంది. లేదంటే ఎక్కువ వర్షం పడితే రోడ్డు మొత్తం మునిగిపోతుంది. దీనివలన కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సమయాలలో మోరి బురద రోడ్డుపైకి రావడం వల్ల, చాలా దుర్గంధం వెదజల్లుతుందని కాలనీవాసులు వాపోతున్నారు.

వర్షం పడ్డప్పుడు ఇంటి నుంచి బయటకు రావాలి అంటే భయపడుతున్న కాలనీవాసులు, దీనివలన కాలనీలో క్రీములు, కీటకాలు, దోమలు, ఈగలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ విషయాన్ని కాలనీవాసులు అధికారులకు, నాయకులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న ఏ ఒక్కరు పట్టించుకోలేదని, కాలనీలో మోరికి మధ్యలో కరెంటు స్తంభం ఉన్నది. ఈ స్తంభం వలన నీరు బయటకు వెదజల్లుతున్నది. అలాగే నీరు వరదకు సరిపోయేంత మోరి పెద్దగా లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులైన పట్టించుకోని సీసీ రోడ్డు, మోరి వసతులు కల్పించగలరని కోరుతున్నారు.