09-08-2025 08:40:00 PM
పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుల పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు, బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కోటగల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం శ్రావణమాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Government Advisors Pocharam Srinivas), ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పోచారం శంభు రెడ్డిలు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
అనంతరం వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేశారు. భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బాన్సువాడ మండలం తాడ్కోల్ రైస్ మిల్ వద్ద బాన్సువాడ సంగమేశ్వర కాలనీ శ్రీ మంజునాథ గణేష్ మండలి ( టీం గరుడ ) వారి ఆధ్వర్యంలో 18 అడుగుల భారీ గణేష్ విగ్రహం ఆగమన కార్యక్రమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాసుల బాలరాజులు హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బాన్సువాడ పట్టణ, బిర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,భక్తులు పాల్గొన్నారు.