calender_icon.png 9 August, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు శ్రావణ గౌరీగా దర్శనం

09-08-2025 08:25:35 PM

కొండపాక: శ్రీ విజయ దుర్గా సామెత సంతన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శనివారం రోజు శ్రావణ పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొండపాక మండలం(Kondapaka Mandal) మర్పడగ గ్రామంలో శ్రీ విజయ దుర్గ సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఉదయం 9 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పాలా హరినాధ శర్మ ఆధ్వర్యంలో సంతాన మల్లికార్జున స్వామికి, విజయదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, విజయ దుర్గ మాత శ్రావణ గౌరీగా భక్తులకు దర్శనం ఇచ్చారు అనంతరం నవావరణ హవనం, సువాసీనులు, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంచేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన కృష్ణ శర్మ, వేద వ్యాస కృష్ణ,కిషోర్ పాండే, మల్లికార్జున్, రాజశేఖర్ వర్మ, వీరేశం తదితరులు పాల్గొన్నారు.