09-08-2025 08:17:36 PM
గాంధారి (విజయక్రాంతి): గాంధారి మండలం(Gandhari Mandal)లోని నారాయణగిరి కొండపై కొలువైన మార్కండేయని గుడిలో శనివారం పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పద్మశాలిలు ప్రతి రాఖీ పౌర్ణమి సందర్భంగా జంజీరాలు వేద పంతులు మంత్ర ధారణ చేసినప్పుడు ప్రతి సభ్యుడు తన మెడలో పాత జంజిరాన్ని కింద నుండి తీసివేసి పై నుండి నూతన జంజీరాన్ని వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
అయితే రాఖీ పౌర్ణమి జంజిరాల పౌర్ణమిగా పద్మశాలిలు భావిస్తారు. ఈ సందర్భంగా నూతన జంజిరాలను ప్రత్యేకంగా దేవుని ముందు ఉంచి శిర నైవేద్యం సమర్పించి సంఘ ఆధ్వర్యంలో నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష ఇద్దరం కలిసి దేశానికి రక్ష అంటూ రక్షాబంధన్ కట్టుకుంటారు. శివ భక్త మార్కండేయ మందిరం వద్ద శ్రావణమాసం సందర్భంగా భక్తిశ్రద్ధలతో భక్తులు శ్రావణ సోమవారం, శనివారం భక్తులుకు మందిరం వద్ద ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు, పురోహితులు జరుప బడుతుంది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.