calender_icon.png 9 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యానికి ప్రతీక రక్షాబంధన్

09-08-2025 08:14:37 PM

హనంకొండ (విజయక్రాంతి): అన్నాచెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్(Raksha Bandhan) అని రాష్ట్ర ఆయిల్ ఫేడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. రాఘవరెడ్డికి రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి రహత్ పర్వీన్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా మనమంతా ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. 

మత సామరస్యం వెళ్ళి విరుస్తుంది..

వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన కిరణ్మయి పెరిక వాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాషాకు రాఖీ కట్టి స్వీట్లు వినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కిరణ్మయి గత 5 సంవత్సరాల నుండి పాషాకు రాఖీ కడుతున్నానని, అంతకుముందు గత 20 సంవత్సరాలు నుండి తన సోదరి పాషాకు రాఖీ కడుతుండగా, తను గత 5 సంవత్సరాల నుండి కడుతూ, అన్నాచెల్లెళ్ల ఆప్యాయతను, ఆత్మీయ బంధాన్ని పంచుకుంటున్నామని తెలిపారు. ఈ విధంగా కులమతాలకు కచ్చితంగా తమమధ్య అన్న చెల్లెలు అనుబంధం కొనసాగుతుందన్నారు. పాషా మాట్లాడుతూ, కిరణ్మయి నాకు దేవుడిచ్చిన చెల్లె అని అన్నారు.