calender_icon.png 9 August, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరమ్మా...కరుణించరా!

09-08-2025 08:08:23 PM

రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం.. ఆమె పాలిట శాపం

మూడేళ్లు అయినా మోక్షం లేదు 

అధికారుల చుట్టూ తిరుగుతున్న ఫైళ్లు 

అన్ని సర్టిఫికెట్స్ జత చేసినా అదనపు కలెక్టర్ తిప్పిపంపిన వైనం 

నారాయణపేట (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా(Narayanpet District)లో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం ఆమె పాలిట శాపంగా మారిన వైనం. మూడు సంవత్సరాలుగా స్థానిక తహసీల్దార్, ఆర్డీవో కలెక్టర్, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఫైల్కు మాత్రం మోక్షం లభించట్లేదు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట మండలంలోని సింగారం గ్రామానికి చెందిన కుర్వ జానకమ్మ సర్వే నెంబర్ 214/ఆ విస్తీర్ణం 1- 14 గుంటల భూమి కొనుగోలు చేసిన భూమి విషయంలో ధరణి సర్వేలో (పార్ట్ బి) లో భాగంగా గ్రామానికి వెళ్ళిన రెవెన్యూ అధికారులు, సర్వేలో భాగంగా సర్వేకు ముందుగానే ఆమె మృతి చెందినట్లు తెలిసి కూడా రెవెన్యూ అధికారులు జానకమ్మ బదులు ఆమె ఒకానొక కూతురు ద్యావరింటి నాగమ్మ ఆధార్ కార్డు నెంబర్ 657782016929.ను ద్యావరింటి జానకమ్మగా పొందుపరిచారు. తీరా తల్లి పేరు మీద నుండి వారసత్వంగా కూతురు ద్యావరింటి నాగమ్మ పేరిట బదిలీ చేసుకోవటానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా పట్టధార్ పాస్ పుస్తకం జానకమ్మ పేరుమీద ఆధార్ కార్డు మాత్రం కూతురు ద్యావరింటి నాగమ్మ నమోదు చేశారు.

కాబట్టి ఆధార్ కార్డు ను తొలగిస్తేనే మీ పేరు మీదకు మారుతుందని అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా ఆమె ధరణిలో టి ఎం 32లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలుపగా ఆమె దరఖాస్తు చేసుకొని ఆధార్ కార్డు, తల్లీ మరణధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రం జత చేసి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవటం జరిగింది. దీనికి గాను అదనపు కలెక్టర్. మళ్ళీ స్థానిక తహసీల్దార్ కార్యాలయంకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జత చేసి పంపాలని మళ్ళీ తిరుగు టపాలో పంపారు. దీంట్లో భాగంగానే ఇటీవల భూభారతిలో రెవెన్యూ సదస్సులు మళ్ళీ ఆమె దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈవిషయమై స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయంకు పంపినా అక్కడ అధికారులు మాత్రం సంబంధిత ఆధార్ కార్డు ను తొలగించడంలో అంతర్యం ఏమిటో మరి ఇప్పటికైనా కలెక్టరమ్మ కనికరించి ఆధార్ కార్డు ను తొలగించి ఆమెకు న్యాయం చేస్తుందా లేదా వేచి చూడాలి.