calender_icon.png 9 August, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యానిధికి రూ.25 వేలు విరాళం

09-08-2025 08:55:00 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల సంఘం సభ్యులు విద్యానిధికి విరాళంగా రూ.25 వేల చెక్కుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy)కి వారి క్యాంపు కార్యాలయంలో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యానిధికి వచ్చే ప్రతి పైసా కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న పేద పిల్లల విద్య కోసమే ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నగరంలో ఉంటున్న ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, విద్యావంతులు విరివిరిగా విద్యానిధికి విరాళాలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షులు రమేష్ బాబు, మునీశ్వర్, మధు, ప్రవీణ్, శివరాం, వంశీకృష్ణ, అనుప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.