09-08-2025 08:35:21 PM
బంగారం ఆభరణాలు స్వాధీనం..
దొంగ బంగారం కొనుగోలు చేస్తే చట్ట పరిధిలో కఠిన చర్యలు..
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): జాతీయ రహదారులపై దోపిడీలు, గ్రామాల్లో ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన పార్థి గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు భాస్కర్ బాపూరావు చవాన్ (A2)ను గాంధారి పోలీసులు 07 ఆగస్టున అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో, అతను దొంగ సొత్తును మహారాష్ట్రకు చెందిన బీరదర్ అభిషేక్, ఇర్ఫాన్ నూర్ ఖాన్‌లకు అమ్మినట్లు బయటపడింది. దొంగ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేసిన ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) మాట్లాడుతూ... దొంగ సొత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదనీ ఎవరికైనా ఇలాంటి సొత్తు అందినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసు ఛేదనలో సదాశివ నగర్ సిఐ బి. సంతోష్ కుమార్, సిసిఎస్ సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ బి. ఆంజనేయులు, సిసిఎస్ ఎస్‌ఐ ఉస్మాన్, సిసిఎస్ సిబ్బంది, స్థానిక పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.