calender_icon.png 9 August, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల బహిరంగ సభను విజయవంతం చేయాలి

09-08-2025 08:02:42 PM

కరీంనగర్ (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ కనిపించాలన్న డిమాండ్ తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న స్థానిక సర్కస్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీలు రావాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనా చారి(BRS Party leader Madhusudhana Chary), మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఒడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్లు సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో ఐదు నియోజకవర్గాల నుండి ఎంత మంది బీసీలను తరలించాలని చర్చించారు. బీసీలు ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు అన్ని నియోజకవర్గాల నుండి బీసీలను తరలించాలని నిర్ణయించారు. బీసీల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ప్రజల్లో ఎండకడతామని  తెలిపారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని  బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ నెల 11న మరోసారి నియోజకవర్గాలకు చెందిన నాయకులతో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. బీసీలు పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలని కోరారు.