calender_icon.png 9 August, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ ఆధ్వర్యంలో బాలసదన్ లో రక్షాబంధన్ కార్యక్రమం

09-08-2025 06:58:26 PM

సామాజిక సేవకు ముందుకురావాలి..

రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జయపాల్ రెడ్డి.. 

కామారెడ్డి (విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో బాలసదన్ లో రక్షాబంధన్(Raksha Bandhan) కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ ఎం.స్వరూపా రాణి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి  మాట్లాడుతూ, రక్షాబంధన్ కార్యక్రమం ఒకరికి ఒకరు రక్షగా ఉండాలని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తోటి వారి పట్ల మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలని అన్నారు. 

సిడీపీఓ ఎం స్వరూపారాణి మాట్లాడుతూ, బాలసదన్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంతోషంగా ఉందని, రక్షాబంధన్ కార్యక్రమం మన దేశంలో ఆడపడుచుల పండగగా రక్షాబంధన్ ను పిలుచుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు పరీక్ష అట్టలను, కంపాక్స్ బాక్స్, పరీక్ష కిట్టును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు శంకర్,ట్రెజరర్ రమణ కుమార్ రోటరీ మెంబర్స్ బాలరాజు, ధనుంజయ్, నాగభూషణం,దత్తాద్రి రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,బాలసదన్ సూపరిండెంట్ సంగమేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.