calender_icon.png 24 July, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కాళేశ్వరుని దర్శించుకున్న బీజాపూర్ ఎమ్మెల్యే

23-07-2025 10:03:42 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని బుధవారం బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండావి(MLA Vikram Mandaviదర్శించుకున్నారు. ఎమ్మెల్యే దేవాలయం వద్దకు రాగా అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికి శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామివారికి అభిషేకం శ్రీ సుభానంద అమ్మవారి ఆలయంలో దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించి అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మహేష్ అర్చకులు సూపరిండెంట్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.