28-01-2026 12:54:29 AM
డీఆర్డీఓ దత్తారావు
బెజ్జూర్, జనవరి 27 (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా ఉపే క్షించేది లేదని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు స్పష్టం చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన పా ల్గొని అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్య లు ప్రకటించారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 7.25 కోట్ల వ్యయంతో చేపట్టిన 828 పనులపై ఎస్‌ఆర్పీ రవి నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ హెచ్చరించా రు.
కృష్ణపల్లి గ్రామంలో టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్ విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలింది. దీంతో అతడిని సస్పెండ్ చేయడంతో పాటు రూ. 3 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు. అదే గ్రామానికి చెందిన మేటిని కూడా విధుల నుంచి తొలగించారు. భారేగూడెం గ్రామానికి చెందిన ఫీల్ అసిస్టెంట్ నారాయణపై కూడా పని చేయకుం డానే చెల్లింపులు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబోరడ్స్ మెన్ పర్సన్ పీవీఎన్ సాయి శ్రీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ కె. ఆంజనేయులు, ఎంపీడీవో బి.ఎస్. ప్రవీణ్ కుమార్, ఏపీవో రాజన్న, ఎస్‌ఆర్పీ రవి తదితరులు పాల్గొన్నారు.